చరిత్ర అంటే ఏమిటి? గత కాలపు కథనాల సమాహారమే చరిత్ర. చారిత్రక అంశాల మీద రాయబడ్డ గ్రంథాలన్నీ సాధారణంగా గతించిన సంఘటనలు రికార్డు అని చెప్పవచ్చు. చారిత్రక అంశాల మీద అనుబంధంగా మరొక ఉప శీర్షిక కూడా ఉన్నది. దానినే చరిత్ర యొక్క తత్వశాస్త్రం (Philodophy of History) లేకా చరిత్ర యొక్క నిర్వచనం (Interpretation of History) అని పిలవడం జరుగుతుంది. మానవ చరిత్ర సంఘటనల్లో విభిన్న సంఘటనల నడుమ ఉన్న సంబంధాల అర్థవంతమైన నిర్వచనమును కనిపెట్టడమే దీని ఉద్దేశం. చరిత్రలోని మొదటి అంశం (చరిత్ర సంకలనం) పై ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కానీ చరిత్ర విశ్లేషణ అంశంపై అర్థవంతమైన వివరణగా చెప్పబడే ఏ ఒక్క పుస్తకం కూడా లేదు.
దీనికి కారణం ఏమిటన్నది డాక్టర్ అలెక్స్ కైరల్ రాసిన “అపరిచిత వ్యక్తి" (Man The Unknown) అనే పుస్తకంలో సరిగ్గా వివరించడం జరిగింది. దాని ప్రకారం చరిత్ర నిర్వచనము అనే అంశం నేరుగా మానవ స్వేచ్ఛతో సంబంధం కలిగి ఉంది. మనిషిని అంచనా వేయటం సాధ్యం కాదు. అందువల్ల అతని చర్యల గురించి సమగ్ర వివరణ సాధ్యం కాదు. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే స్వేచ్ఛ ప్రతి మనిషికి ఉంది. అందువల్ల మానవ చరిత్ర సమగ్ర నిర్వచనము.